News September 6, 2025

స్వచ్ఛ సర్వేక్షణలో పారదర్శకంగా ఎంపికలు: కలెక్టర్

image

పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల కోసం ఎంపికలను పారదర్శకంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, బస్టాండ్లు, పాఠశాలలు, రైతు బజార్లను ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేయాలని సూచించారు.

Similar News

News September 7, 2025

హనుమకొండ: బీఎస్పీ గెలుపు కోసం కృషి చేయాలి: దయానంద్

image

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర కో-ఆర్డినేటర్ దయానంద్ అన్నారు. హనుమకొండలో బీఎస్పీ ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. బహుజన సిద్ధాంతాన్ని గ్రామ స్థాయికి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని దయానంద్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బీఎస్పీ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

News September 7, 2025

BRS కుట్రలను తిప్పి కొట్టాలి: మహబూబాబాద్ ఎమ్మెల్యే

image

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేందుకు BRS, BJP చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని MHBD ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. ఈ మేరకు క్యాంప్ కార్యాలయంలో ఎంపీ బలరాంతో కలిసి ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంతో అభివృద్ధి పనుల కోసం విజ్ఞప్తి చేయడానికి వెళ్లిన సోయం బాపూరావు, తెల్లం వెంకట్రావ్‌ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ కోసమే కలిశారని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

News September 7, 2025

కాజీపేటలో 32 అడుగుల మట్టి గణపతి నిమజ్జనం

image

కాజీపేట డీజీల్ కాలనీలో శనివారం 32 అడుగుల మట్టి గణపతిని స్థాపించిన చోటనే నిమజ్జనం చేశారు. శ్రీసాయి యూత్ ఆధ్వర్యంలో 32 అడుగుల మట్టి గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. వేలం పాటలో రూ.38,016కు నరసింగ రావు అనే భక్తుడు లడ్డూను దక్కించుకున్నాడు. ఫైర్ ఇంజిన్ సహాయంతో గణేశ్ నిమజ్జనం పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.