News September 6, 2025
అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నా: బన్ని

దుబాయ్‌లో జరిగిన SIIMA వేడుకలో అందుకున్న బెస్ట్ యాక్టర్(మేల్) అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘ఎల్లప్పుడూ ప్రేమ, గుర్తింపు అందిస్తున్నందుకు SIIMAకి ధన్యవాదాలు. వరుసగా మూడు అవార్డులు గెలుచుకోవడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ సుకుమార్, పుష్ప టెక్నీషియన్స్, నిర్మాతలు, చిత్ర బృందం వల్లే ఇది సాధ్యమైంది’ అని బన్ని రాసుకొచ్చారు.
Similar News
News September 7, 2025
ఆంధ్రాప్రెన్యూర్స్ పేరు నిలబెట్టండి: సీఎం చంద్రబాబు

AP: యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం నడుపుతున్న సంస్థలను మరింత వృద్ధిలోకి తేవాలని, ఆంధ్రాప్రెన్యూర్స్ అనే పేరు నిలబెట్టాలని అన్నారు. ఎంట్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ‘సమాజానికి సంపద సృష్టించి సేవలందించండి. అంతర్జాతీయ బ్రాండ్‌గా మన ఉత్పత్తులు తయారు కావాలి’ అని సూచించారు.
News September 7, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(సెప్టెంబర్ 7, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.50 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.25 గంటలకు
✒ ఇష: రాత్రి 7.38 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.