News September 6, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పూర్తి చేశారా..ఈ అవకాశం మీకోసమే

ఇంటర్మీడియేట్ వృత్తి, విద్యా కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణులైన వారికి అప్రెంటిస్ మేళా జరగనుంది. ఈ నెల 8న ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించే ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ వృత్తి విద్యాశాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. అప్రెంటిస్ ఎంపికలతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ ఐటీఐ ఎచ్చెర్ల ప్రిన్సిపల్ ఎల్.సుధాకరరావు కన్వీనర్ అన్నారు.
Similar News
News September 7, 2025
శ్రీకాకుళం: పరీక్షా కేంద్రాల పరిశీలన

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ జరగనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షల ఏర్పాట్లను శనివారం ఏపీపీఎస్సీ సభ్యుడు ఎన్. సోనీ వుడ్ పరిశీలించారు. జిల్లాలోని ముఖ్యమైన మూడు కేంద్రాలతో పాటుగా ఆయా అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
News September 7, 2025
ఎచ్చెర్ల: గూగుల్ అంబాసిడర్‌గా వర్శిటీ ఈ.సి.ఈ. విద్యార్థి

ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ (ఈ.సి.ఈ.) విభాగానికి చెందిన బిటెక్ మూడో సంవత్సరం విద్యార్థి శతపతి సాయి ప్రదీప్ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్కు స్టూడెంట్ అంబాసిడర్ (జి.ఎస్.ఎ.)గా ఎంపికయ్యారు. ఏఐ, గూగుల్ టెక్నాలజీపై స్వల్పకాలిక అవగాహన, శిక్షణా కార్యక్రమల నిర్వహణకు ప్రదీప్‌కు ఈ అవకాశం లభించిందన్నారు. ఎంపికపట్ల వర్శిటీ వీసి రజని శనివారం ప్రత్యేకంగా అభినందించారు.
News September 7, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

✶ సమస్యలపై వినతులు స్వీకరించిన అచ్చెన్నాయుడు
✶ శ్రీకాకుళం: ఎరువుల పంపిణీ పరిశీలించిన కలెక్టర్
✶ రైతన్నకు బాసటగా వైసీపీ నిలుస్తుంది: మాజీ మంత్రి అప్పలరాజు
✶ మందస: ఎలుగు దాడిలో నలుగురికి గాయాలు
✶ ఎచ్చెర్ల: గూగుల్ అంబాసిడర్‌గా అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థి
✶ రణస్థలం: రోడ్డు మధ్యలో జాతీయ జండా
✶ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు బాధాకరం: తమ్మినేని సీతారాం