News September 6, 2025

ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం.. ఏరియల్ వ్యూ

image

నగరంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగుతోందని నిర్ధారించుకునేందుకు అధికారులు ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నిమజ్జన సరళిని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన సమీక్షించారు.

Similar News

News September 7, 2025

విద్యార్థులకు ALERT.. రేపు CPGET రిజల్ట్స్

image

వివిధ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన సీపీగెట్ (CPGET) ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేయనున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్స్, ఎంకాం, ఎంఏ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థులు పరీక్షలు రాశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ బాలక్రిష్ణారెడ్డి తెలిపారు.

News September 7, 2025

HYD: కలిసొచ్చిన వినాయక చవితి.. రూ.99కే ఎలక్ట్రిక్ బైక్

image

వినాయక చవితి ఓ వ్యక్తికి కలిసి వచ్చింది. నిమజ్జనం సందర్భంగా రూ.99కే ఎలక్ట్రిక్ బైక్‌ను గెలుచుకున్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని అంజనాద్రి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ లక్కీ డ్రాలో పాల్గొన్న అనిల్.. రూ.99కే ఎలక్ట్రిక్ బైక్ సొంతం చేసుకున్నాడు. లక్కీ టికెట్ పద్ధతిలో బైక్‌ను అందించాలని కమిటీ నిర్ణయించడంతో 425 మంది డ్రాలో పాల్గొన్నారు. అయితే అనిల్‌కు అదృష్టం వరించడంతో సంతోషం వ్యక్తం చేశాడు.

News September 7, 2025

HYD: టస్కర్ వాహనం కిందపడి జీహెచ్‌ఎంసీ కార్మికురాలి మృతి

image

బషీర్‌బాగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక(50) మృతి చెందింది. గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తుంది. ఇవాళ ఉదయం బషీర్‌బాగ్–లిబర్టీ మార్గంలో విధుల్లో ఉండగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు వాహనం కిందపడింది. తలకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. పోలీసులు డ్రైవర్‌ గజానంద్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.