News September 6, 2025
చంద్ర గ్రహణం కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దు

సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు శనివారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేయడం జరిగిందనీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.
Similar News
News September 7, 2025
NZB: ఆలయాల మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయాలను మూసివేశారు. నీలకంఠేశ్వరాలయం, గోల్ హనుమాన్, జెండా బాలాజీ, శంభుని గుడి, రామాలయం, శ్రీకృష్ణ టెంపుల్, సారంగపూర్ హనుమాన్ ఆలయం, రోకడ్ హనుమాన్ ఆలయం తదితర ఆలయాలను పూజారులు మూసివేశారు. తిరిగి సోమవారం సంప్రోక్షణ చేసిన అనంతరం నిత్య పూజలు చేయనున్నారు.
News September 7, 2025
ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర: MLA ధన్పాల్

జెండా బాలాజీ జాతర ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర ఉందని నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. ఆదివారం ఆయన జెండా బాలాజీ ఆలయంలో నిర్వహించిన జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో జిల్లా మరింత అభివృద్ధి చెందాలని, జిల్లా ప్రజలందరు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.
News September 7, 2025
అన్నమయ్య: ఓ ఇంటిలోకి దూసుకెళ్లిన కారు

అన్నమయ్య జిల్లా కంటేవారిపల్లెలో కారు బీభత్సం సృష్టించింది. హార్సిలీహిల్స్‌కు వెళ్తున్న కారు ఆదివారం కురబలకోట మండలం కంటేవారిపల్లెలో అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. పలమనేరుకు చెందిన కొందరు యువకులు కారులో హార్సిలీహిల్స్‌కు బయలుదేరారు. కారు మార్గమధ్యంలో మండలంలోని కంటేవారిపల్లెలోని మనోహర్ అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు, బైక్, మట్టి కుండలు ధ్వంసమయ్యాయి.