News September 6, 2025

కొత్తపట్నం వద్ద విషాదం.. స్పందించిన మంత్రి!

image

కొత్తపట్నం మండలం గుండమాల తీరం వద్ద శనివారం మోటుమాల గ్రామానికి చెందిన నాగరాజు, బాలచందర్ మృతి చెందడంపై మంత్రి స్వామి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గుండమాల తీరం వద్ద నిమజ్జనోత్సవం సందర్భంగా వీరు మృతి చెందినట్లు సమాచారం అందుకున్న, మంత్రి స్వామి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిమజ్జనం సమయంలో భక్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోరారు.

Similar News

News September 7, 2025

ప్రకాశంలో పలు ఆలయాలు మూసివేత..!

image

ప్రకాశం జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాల దర్శనాలను ఆలయాల ఈవోలు నిలిపివేశారు. నేడు చంద్రగ్రహణం కారణంగా దర్శనాల నిలిపివేతపై ఆలయాల అధికారులు ప్రకటనలు జారీ చేశారు. ప్రధానంగా జిల్లాలోని భైరవకోనలో వెలసిన శ్రీ భైరవేశ్వర ఆలయం, త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం, మార్కాపురంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం, పలు ఆలయాల దర్శనాలను నిలిపివేశారు. సోమవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం దర్శనాలకు అనుమతిస్తారు.

News September 7, 2025

ఒంగోలులో 5K రన్.. ప్రైజ్ మనీ ఎంతంటే.!

image

ఒంగోలులో ఈనెల 12న కలెక్టర్ కార్యాలయం నుంచి 5 కిలోమీటర్ల మారథాన్‌ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. 17 నుంచి 25 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులు, అలాగే ట్రాన్స్‌జెండర్ విభాగాల్లో ఈ పరుగు పందెం నిర్వహిస్తామన్నారు. పోటీలో ప్రథమ విజేతకు రూ.10వేలు, ద్వితీయ విజేతకు రూ.7వేలు అందిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 10వ తేదీలోగా 9493554212 నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News September 7, 2025

ప్రకాశం: వైద్యారోగ్య శాఖలో ఖాళీలు.. మెరిట్ లిస్ట్ విడుదల!

image

ప్రకాశం జిల్లాలో గల పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సెస్, ఎఫ్ఎన్ఓ, ఎస్ఏడబ్ల్యు పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల మెరిట్, తిరస్కరణ లిస్ట్ విడుదల చేసినట్లు DMHO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్వో కార్యాలయం శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు http://Prakasam.ap.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.