News September 6, 2025

ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్‌హిట్ సినిమా

image

రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘సు ఫ్రం సో’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 9 నుంచి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది. జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ తొలుత కన్నడలో రిలీజై ఆకట్టుకుంది. తర్వాత తెలుగులోనూ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది.

Similar News

News September 7, 2025

చంద్రగ్రహణం.. తెరిచే ఉండనున్న శ్రీకాళహస్తి ఆలయం

image

AP: చంద్రగ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూసివేస్తే శ్రీకాళహస్తి టెంపుల్ మాత్రం తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో నవగ్రహ అలంకార కవచం వల్ల గ్రహణ ప్రభావం గుడిపై పడదని పండితులు చెబుతున్నారు. రోజులాగే రాత్రి 9 గంటలకు టెంపుల్ మూసివేసి, గ్రహణ సమయంలో రాత్రి 11 గంటలకు తెరిచి గ్రహణకాల అభిషేకాలు, శాంతిపూజలు నిర్వహిస్తారు. అయితే భక్తులకు రేపు ఉదయం 6 గంటలకు దర్శనం కల్పిస్తారు.

News September 7, 2025

జపాన్ ప్రధాని రాజీనామా

image

జపాన్ PM షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ఎగువ సభలో పరాజయం చెందింది. దీనికి బాధ్యత వహించాలంటూ ఆయనపై సొంత పార్టీ(లిబరల్ డెమోక్రటిక్) నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. అంతర్గత విభేదాలకు స్వస్తి పలికేందుకు షిగెరు తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న సంకీర్ణ ప్రభుత్వం త్వరలోనే ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోనుంది.

News September 7, 2025

వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగు: మహేశ్ గౌడ్

image

TG: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగి వచ్చేలా ఈ నెల 15న కామారెడ్డి సభ ఉండనుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. BJP నేతలు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటారని ఫైరయ్యారు. లిక్కర్ రాణిగా కవిత నిజామాబాద్‌కు చెడ్డపేరు తీసుకొచ్చారని విమర్శించారు. కవిత ఎపిసోడ్ KCR ఆడించే డ్రామా అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగవుతుందన్నారు.