News April 3, 2024

సీటెట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

image

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET-2024) రిజిస్ట్రేషన్ గడువును ఏప్రిల్ 5 వరకు పొడిగిస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 2తో గడువు ముగియాల్సి ఉండగా, మరో 3 రోజులు పొడిగించినట్లు తెలిపింది. ఈ పరీక్ష జులై 7న రెండు షిఫ్టుల్లో జరగనుంది. 20 భాషల్లో నిర్వహించనున్నారు.

Similar News

News March 12, 2026

కూతురికి గన్ ఫైరింగ్ నేర్పిస్తున్న కిమ్

image

గన్‌తో ఫైరింగ్ ఎలా చేయాలో తన కూతురికి దగ్గరుండి నేర్పిస్తున్నారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. తన కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి ఆయన ఇవాళ ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారు. గురిచూసి కాలుస్తున్న వీరిద్దరి ఫొటోలను అక్కడి మీడియా విడుదల చేసింది. ప్రతి ఈవెంట్‌కు తనతో పాటు తీసుకెళ్లడం, దగ్గరుండి షూటింగ్ నేర్పిస్తుండటంతో తదుపరి వారసురాలిగా కిమ్ జూ ఏను ఆయన సిద్ధం చేస్తున్నారనే ప్రచారం బలపడుతోంది.

News March 12, 2026

నానుడి.. ‘ధృతరాష్ట్ర కౌగిలి’ అంటే ఏమిటి?

image

పైకి ప్రేమ నటిస్తూ లోపల ద్వేషంతో అవతలి వ్యక్తిని నాశనం చేయాలని ఇచ్చే కౌగిలింతను ‘ధృతరాష్ట్ర కౌగిలి’ అంటారు. భారతంలో ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయినా బలవంతుడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆశీర్వాదం కోసం పాండవులు వస్తారు. తన 100 మంది కొడుకులనూ చంపిన భీముడిని నలిపి చంపాలని ఆయన ప్రయత్నించగా కృష్ణుడు ఇనుప విగ్రహాన్ని ఉంచి కాపాడతారు. మీ జీవితంలో ధృతరాష్ట్ర కౌగిలి ఇచ్చేవారెవరో కామెంట్.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 12, 2026

క్రాష్ కంటిన్యూ.. 800 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ క్లోజ్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 829 పాయింట్లు కోల్పోయి 76,034కు చేరగా.. నిఫ్టీ 227 పాయింట్ల నష్టంతో 23,639 వద్ద సెటిల్ అయింది. సెన్సెక్స్ టాప్ 30 సూచీలో NTPC, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, HCL టెక్ మినహా ఇతర సూచీలన్నీ నష్టాలతోనే ముగిశాయి. క్రూడ్ ఆయిల్ ధరల హైక్, భారత్ సహా 16 దేశాలపై ట్రేడ్ దర్యాప్తుకు ట్రంప్ ఆదేశించడం, FII సెల్లింగ్, రూపీ క్షీణత సూచీలపై ప్రభావం చూపించింది.