News September 6, 2025
రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో యూరియా: కలెక్టర్

నెల్లూరు జిల్లాలో 2471 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. రాబోయే పది రోజులలో 500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరుతుందని అన్నారు. రైతు సేవా కేంద్రాలలో యూరియా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆధార్ అధికృత విధానం ద్వారా యూరియా పంపిణీ జరుగుతుందన్నారు. యూరియా సరఫరాలో లేదా ధరలలో ఫిర్యాదులు ఉంటే 8331057285 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Similar News
News September 7, 2025
కావలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. తలమంచి- కొడవలూరు రైల్వే స్టేషన్ మధ్య మూడో లైన్‌లో వెళుతున్న రైలు నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నోవల్ టోపనో జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. మృతదేహాన్ని కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉంచామన్నారు.
News September 7, 2025
ఉదయగిరిలో గాజుల కుటుంబానికి అరుదైన గౌరవం

ఉదయగిరిలోని గాజుల వీధికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరి కుటుంబంలో దాదాపు 25 మంది ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశారు. ప్రతి సంవత్సరం ఈ కుటుంబంలో ఎవరికో ఒకరికి స్టేట్, జిల్లా, మండల అవార్డు వస్తుంది. గత సంవత్సరం స్టేట్ అవార్డు గాజుల షారుక్, గాజుల మున్న అందుకోగా, ఈ సంవత్సరం షాహిదా అక్తర్ జిల్లా అవార్డు, రంతుజాని మండల అవార్డు అందుకున్నారు.
News September 7, 2025
CMచేతుల మీదుగా అవార్డు అందుకున్న టీచర్ ఈశ్వరమ్మ

కందుకూరుకు చెందిన టీచర్ ఈశ్వరమ్మ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును CMచంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అందుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లా PCపల్లిలో టీచర్‌గా పనిచేస్తున్నారు. సాహిత్యాభిలాషి అయిన ఆమె ‘ఈశ్వరీభూషణం’ అనే కలం పేరుతో దాదాపు 2 వేల కవితలు రాసి ప్రశంసలు పొందారు. అవార్డు అందుకున్న ఆమెను పలువురు అభినందిస్తున్నారు.