News September 6, 2025

ఎచ్చెర్ల: గూగుల్ అంబాసిడర్‌గా వర్శిటీ ఈ.సి.ఈ. విద్యార్థి

image

ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ (ఈ.సి.ఈ.) విభాగానికి చెందిన బిటెక్ మూడో సంవత్సరం విద్యార్థి శతపతి సాయి ప్రదీప్ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్కు స్టూడెంట్ అంబాసిడర్ (జి.ఎస్.ఎ.)గా ఎంపికయ్యారు. ఏఐ, గూగుల్ టెక్నాలజీపై స్వల్పకాలిక అవగాహన, శిక్షణా కార్యక్రమల నిర్వహణకు ప్రదీప్‌కు ఈ అవకాశం లభించిందన్నారు. ఎంపికపట్ల వర్శిటీ వీసి రజని శనివారం ప్రత్యేకంగా అభినందించారు.

Similar News

News September 8, 2025

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. మరో వారం రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి విడత ఎరువులు వచ్చే అంచనా తేదీని గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు

News September 8, 2025

శ్రీకాకుళంలోయథాతథంగా గ్రీవెన్స్

image

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో నేడు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 7, 2025

సిక్కోలు నటుడికి SIIMA అవార్డు

image

ఆమదాలవలస(M) కొర్లకోటకి చెందిన నటుడు పేడాడ సందీప్ సూరజ్‌కి దుబాయ్‌లో జరిగిన SIIMA అవార్డ్స్‌లో బెస్ట్ డెబ్యూ హీరో అవార్డును శనివారం ప్రకటించారు. సూరజ్ హీరోగా నటించిన ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాకి గాను అవార్డు లభించింది. దీంతో అతనికి అభిమానులు, గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు. సందీప్ సరోజ్ తల్లి రమణకుమారి విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.