News September 6, 2025

కడప: LLB సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

YVU LLB (మూడేళ్ల, ఐదేళ్ల) పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. అల్లం శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. LLB (ఐదేళ్ల) మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 50.42 శాతం మంది, LLB (మూడేళ్ల) ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల్లో 17.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. కృష్ణారావు పాల్గొన్నారు.

Similar News

News September 8, 2025

కడప జిల్లాలో తెరుచుకున్న ఆలయాలు

image

చంద్రగ్రహణం సందర్భంగా కడప జిల్లాలోని అన్ని ఆలయాలు మూత పడిన విషయం తెలిసిందే. గ్రహణం వీడటంతో ఇవాళ తెల్లవారుజామున ఆలయాలు తెరిచారు. ఒంటమిట్ట కోదండరామాలయంలో టీటీడీ అర్చకులు ఆలయ శుద్ధి చేశారు. తర్వాత సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జిల్లాలోని ఇతర ఆలయాల్లోనూ దర్శనాలు తిరిగి మొదలయ్యాయి.

News September 8, 2025

ప్రొద్దుటూరు జిల్లా డిమాండ్‌కు MLA మద్దతు

image

ప్రొద్దుటూరు జిల్లా డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈక్రమంలో ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జేఏసీ సభ్యులు పలువురి మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆదివారం కలిసి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. జిల్లాల రీ ఆర్గనైజేషన్ కమిటీ త్వరలో కడప జిల్లా పర్యటనకు వస్తుందని.. అప్పుడు ప్రొద్దుటూరు జిల్లాపై వినతిపత్రం అందజేస్తానని చెప్పారు.

News September 7, 2025

చంద్రగ్రహణం.. ఒంటిమిట్ట ఆలయం మూసివేత

image

ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే కడప జిల్లాలోని పలు ఆలయాలు పొలతల మల్లేశ్వరస్వామి, పులివెందులలోని వెంకటేశ్వర స్వామి, మిట్ట మల్లేశ్వరస్వామి, రంగనాథస్వామి ఆలయం, గండి వీరాంజనేయస్వామి ఆలయం, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం మూసివేయనున్నట్లు గండి EO వెంకటసుబ్బయ్య తెలిపారు.