News September 6, 2025

GREAT: 20లక్షల పుస్తకాలతో లైబ్రరీ

image

పుస్తకాలు సేకరించే అభిరుచిని ప్రజా ప్రయోజనంగా మార్చారు కర్ణాటకలోని హరలహల్లికి చెందిన అంకే గౌడ. బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి సాహిత్యంలో మాస్టర్స్ పూర్తి చేశారు. పుస్తకాల సేకరణకు తన ఆస్తిని కూడా అమ్మేశారు. ప్రస్తుతం ఆయన 20లక్షల పుస్తకాలతో వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటు చేయగా అందులో 5లక్షల విదేశీ పుస్తకాలు, వివిధ భాషలకు చెందిన 5K నిఘంటువులు ఉన్నాయి. ఈ లైబ్రరీకి న్యాయమూర్తులు సైతం వెళ్తుంటారు.

Similar News

News September 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 8, 2025

సెప్టెంబర్ 8: చరిత్రలో ఈ రోజు

image

✶ 1910: సినీ దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జననం
✶ 1933: గాయని ఆశా భోస్లే జననం (ఫొటోలో లెఫ్ట్)
✶ 1936: సంగీత దర్శకుడు చక్రవర్తి జననం (ఫొటోలో రైట్)
✶ 1951: డైరెక్టర్ మాధవపెద్ది సురేశ్ జననం
✶ 1986: బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ జననం
✶1999: క్రికెటర్ శుభ్‌మన్ గిల్ జననం
✶ 2020: నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం
✶ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
✶ ప్రపంచ శారీరక చికిత్స (ఫిజియోథెరపీ) దినోత్సవం

News September 8, 2025

పెట్టుబడులతో రాష్ట్రానికి రండి: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని, పెట్టుబడులతో రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేశ్ కోరారు. కోయంబత్తూరులో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ‘పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నాం. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో రాష్ట్రానికి వచ్చాక నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మాదే’ అని పేర్కొన్నారు.