News September 6, 2025

మెదక్: ఆయిల్ పామ్ సాగు పెంచాలి: యాస్మిన్ బాషా

image

జిల్లాలో ఆయిల్ పామ్ సాగును పెంచాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా సూచించారు. ప్రభుత్వం ఈ సాగుకు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తోందని ఆమె తెలిపారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామంలో రైతు నరసింహారావు పొలంలో జరిగిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి పాల్గొన్నారు.

Similar News

News September 8, 2025

చేగుంట: చెట్టును ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

image

చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట నుంచి బోనాల వైపు వెళ్తున్న ఒక కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రామాయంపేట మండలం శివాయపల్లికి చెందిన సాయితేజ్ (23) మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News September 8, 2025

మెదక్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

పాపన్నపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.

News September 7, 2025

మెదక్: ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం: ఎస్పీ

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు తెలిపారు. 11 రోజుల పాటు జిల్లా అంతటా పోలీస్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో 24 గంటలు అప్రమత్తంగా పనిచేయడంతో అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో వినాయక ఉత్సవాలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సిబ్బందిని అభినందించారు.