News September 6, 2025
మహబూబాబాద్: కురవిలో విషాదం

కరెంట్ షాక్ తగిలి రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సాయి అనే రైతు తన వ్యవసాయ మోటార్ రిపేర్ కోసం దగ్గరలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేసేందుకు వెళ్లగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 8, 2025
సంగీత దర్శకుడు మన గుంటూరు వారే

చక్రవర్తిగా సుపరిచితుడైన సంగీత దర్శక గాయకుడు చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు,ఆయన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో 1936 సెప్టెంబరు 8న జన్మించారు. అతను 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. చక్రవర్తి 959 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. భారత తపాలశాఖ వారు గుంటూరులో 2014 సెప్టెంబర్ 9న చక్రవర్తి గారిపై ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు.
News September 8, 2025
NTR: అధికారుల లెక్కల్లోనే సమస్యల పరిష్కారం

PGRSలో అధికారుల నివేదికలకు, ప్రజల సంతృప్తికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. జూన్ 1 నుంచి 10,239 సమస్యలు రాగా, 9,261 పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఐవీఆర్ఎస్ కాల్స్‌లో సగానికిపైగా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సమస్యలను పట్టించుకోకపోవడం, దరఖాస్తులు సచివాలయాలకే పరిమితం కావడం ఈ పరిస్థితికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.
News September 8, 2025
నిజాంసాగర్: నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 20,376 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని AEE సాకేత్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 27,352 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 17.802 TMCలు కాగా, ప్రస్తుతం 17.325 TMCలు నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కాలువ ద్వారా పంటలకు1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.