News September 6, 2025
VZM: యూరియా పంపిణీపై కలెక్టర్ కీలక ప్రకటన

ప్రస్తుతం విజయనగరం జిల్లాలో 1,122 మెట్రిక్ టన్నుల యూరియా RSK, ప్రయివేటు వర్తకుల వద్దా సిద్ధంగా ఉందని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం తెలిపారు. సోమవారం మరో 850 టన్నులు, గురువారం 1,000 టన్నులు యూరియా జిల్లాకు రానుందని పేర్కొన్నారు. ఇది కాకుండా ఈ నెలాఖరుకి మరో 3,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని వెల్లడించారు. రైతులు షాపులవద్ద గంటల తరబడి క్యూల్లో నిల్చోవాల్సిన అవసరం లేదన్నారు.
Similar News
News September 8, 2025
VZM: కలెక్టరేట్లో నేడు యధావిధిగా PGRS

విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం యధావిధిగా PGRS జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చు అన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 7, 2025
పిడుగుపాటుతో 30 మేకలు మృత్యువాత

వేపాడ మండలం కొండగంగుబూడిలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి 30 మేకలు మృతి చెందాయి. వర్షానికి మేకలన్ని చెట్టు దగ్గరికి చేరడంతో పిడుగుపాటుకు గురయ్యాయి. నంది రమేశ్, గలారి పదసాహెబ్, సార ఎర్రయమ్మ సార బుచ్చమ్మకి చెందిన జీవాలు కొండపైన మరణించడంతో జీవనోపాధి కోల్పోయామంటూ వారు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
News September 7, 2025
కేసులు పరిష్కారమయ్యేలా కృషి: VZM SP

విజయనగరం జిల్లాలో ఈనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని SP వకుల్ జిందాల్ ఆదివారం తెలిపారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి, ఇందుకుగాను పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు.