News September 6, 2025
నంద్యాల జిల్లాలో యూరియా కొరత లేదు: మంత్రి ఫరూక్

నంద్యాల జిల్లాలో ఎటువంటి యూరియా కొరత లేదని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. జిల్లాకు రెండు రోజులలో 5,200 యూరియా వచ్చిందన్నారు. యురియాను జిల్లాలోని 162 రైతు సేవా కేంద్రాలకు 3,245 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. యూరియా సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు అవసరమైన యురియాను కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు.
Similar News
News September 8, 2025
VZM: రూ.40 లక్షల విలువ చేసే ఎరువులు సీజ్

ప్రైవేటుగా అధిక రేట్లకు ఎరువులు అమ్ముతున్నారని వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్, పోలీస్ అధికారులతో ముమ్మర తనిఖీలు జరిపించి, అధిక ధరలను అరికడతామని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం తన ఛాంబర్లో మాట్లాడుతూ.. ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో 411 చోట్ల తనిఖీలు నిర్వహించి, ఒక FIR నమోదు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.40 లక్షలు విలువ గల 172 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను సీజ్ చేశామన్నారు.
News September 8, 2025
MBNR: 3,000 విగ్రహాల నిమజ్జనం ప్రశాంతం: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లాలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,000 విగ్రహాలను నిబంధనల ప్రకారం వివిధ చెరువులు, శివార్లలో నిమజ్జనం చేశారని ఆమె చెప్పారు. కొద్ది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరిగిన గణేశ్ ఉత్సవాలు, అనంతరం నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముగిశాయని పేర్కొన్నారు.
News September 8, 2025
రూ.298 కోట్లతో కోకాపేట లేఅవుట్ డెవలప్‌మెంట్

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3, ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2తో పాటు కోకాపేట లేఅవుట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు నేడు CM రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.298 కోట్లతో కోకాపేట లే అవుట్, నియోపొలిస్, స్పెషల్ ఎకనామిక్ జోన్(SEZ)లో తాగునీరు, నూతన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కీలక ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.