News September 6, 2025

బాపట్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

image

బైక్, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన బాపట్ల మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కొండుబోట్లపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురు యువకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొక వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 8, 2025

అధికారిక మీటింగ్‌లో సీఎం భర్త.. మండిపడ్డ ఆప్

image

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె భర్త మనీశ్ గుప్తా పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తలపిస్తోందని విమర్శించింది. అధికారిక మీటింగ్‌లో సీఎం పక్క ఛైర్‌లో ఆమె భర్త కూర్చున్న ఫొటోను Xలో షేర్ చేసింది. ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది.

News September 8, 2025

ములుగు: నిండు కుండల్లా జలాశయాలు..!

image

ములుగు జిల్లాలోని జలాశయాలు నిండు కుండల్లా మారాయి. రామప్ప, లక్నవరం చెరువులు, మల్లూరు, పాలెంవాగు, గుండ్లవాగు ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో ఆయకట్టు పొలాలకు నీటి కొరత తీరినట్లే. ఒక్కసారి నిండితే రెండు పంటలకు సంవృద్ధిగా నీరు లభిస్తుంది. కానీ, లక్నవరం చెరువు, మల్లూరు ప్రాజెక్టుల్లో లీకేజీ కారణంగా జలాలు వృథాగా పోతున్నాయి. ప్రాధాన్యతగా మరమ్మతులు చేయాల్సి ఉంది.

News September 8, 2025

అనకాపల్లి: పోస్టుల ఖాలీ.. నిరుద్యోగులకు ‘పరీక్షే’..!

image

అనకాపల్లి జిల్లాలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. గ్రంథాలయ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ఇన్‌ఛార్జ్‌లతో నడుస్తున్నాయి. ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న కోటవురట్ల లైబ్రేరియన్ స్థానంలో పాములవాక గ్రామీణ గ్రంథాలయ అధికారి ఇ‌న్‌ఛార్జ్‌గా ఉన్నారు. అలాగే జిల్లాలో రాంబిల్లి, ఎస్.రాయవరం, ఏటికొప్పాక గ్రంథాలయ అధికారుల పోస్టులను భర్తీ చేయలేదు. జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి.