News September 6, 2025

వరంగల్: దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

image

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రూ.4.35 కోట్ల వ్యయంతో ఆరు దేవాలయాల అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పు నియోజకవర్గంలోని 18 దేవాలయాల అభివృద్ధిని దశలవారీగా చేపడతామని తెలిపారు.

Similar News

News September 8, 2025

ఫుడ్ డెలివరీ యాప్స్‌లో అధిక ధరలు.. నెట్టింట చర్చ!

image

రెస్టారెంట్‌ ధరలు, ఫుడ్ డెలివరీ యాప్ ధరలకు భారీ వ్యత్యాసం ఉండటంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ వ్యక్తి తన ఇంటికి దగ్గర్లోని రెస్టారెంట్ నుంచి స్విగ్గీలో ఆహారాన్ని బుక్ చేయాలనుకున్నాడు. అందులో రూ.1,473 ఛార్జ్ చేయడం చూసి అతడే స్వయంగా రెస్టారెంట్‌కు వెళ్లి రూ.810కే తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని Xలో లేవనెత్తడంతో తామూ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నామని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. మీకూ ఇలానే జరిగిందా?

News September 8, 2025

సిద్దిపేట: అదను దాటవట్టే..యూరియా అందదాయే !

image

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత అన్నదాతల్ని తీవ్రంగా వేధిస్తోంది. నెలరోజులుగా యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు వర్ణనాతీతం. పంటలు ఎదిగే కీలక దశలో చల్లాల్సిన యూరియా దొరక్కపోవడంతో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 4.87 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగులోకి వచ్చాయి. 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా 28,882 మెట్రిక్ టన్నులే వచ్చింది.

News September 8, 2025

వారం రోజులు సెలవుల్లో మున్సిపల్ కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వారం రోజులపాటు సెలవుల్లో ఉండనున్నారు. వ్యక్తిగత కారణాలతో నేటి(సోమవారం) నుంచి ఆమె సెలవుల్లో ఉంటారని అధికారులు తెలిపారు. ఈనెల 15న తిరిగి విధుల్లో చేరనున్నారని, ఈ నేపథ్యంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్ తాత్కాలికంగా కమిషనర్ బాధ్యతలను ఇన్‌ఛార్జిగా స్వీకరిస్తారని చెప్పారు.