News September 6, 2025
VKB: ‘కాంగ్రెస్‌పై ప్రేమ ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి’

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉపాధ్యాయులను కోరడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ విమర్శించారు. కాంగ్రెస్‌పై ప్రేమ ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవాలని ఆయన హితవు పలికారు. స్పీకర్ పదవిలో ఉండి ఇలా మాట్లాడటం ఆ పదవికే మచ్చ తెస్తుందని అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచమని కోరాల్సింది పోయి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు.
Similar News
News September 8, 2025
ఈవారం ఓటీటీలోకి రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలు

సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కూలీ’ ఈనెల 11న ఓటీటీలో(అమెజాన్ ప్రైమ్ వీడియో) విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా తెరకెక్కిన ‘సైయారా’ చిత్రం ఈనెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
News September 8, 2025
బీచ్ ఫెస్టివల్‌పై అధికారులతో కలెక్టర్ సమీక్ష

బాపట్లలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు రావాలని కలెక్టర్ వెంకట మురళి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బీచ్ ఫెస్టివల్‌పై అధికారులతో సమీక్ష జరిగింది. సూర్యలంక సముద్ర తీరం మరొక గోవాగా అభివృద్ధి చెందాలని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంతో బాపట్లలో వ్యాపారాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. బావుడా ఛైర్మన్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.
News September 8, 2025
మహాలయ పక్షాలు అంటే ఏంటి?

భాద్రపద మాసంలో కృష్ణ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షాలు అని అంటారు. అవి నేడు ప్రారంభమయ్యాయి. ఈ దినాలు పితృ దేవతలకు సంబంధించినవని, పితృ కార్యాలు చేయడానికి పవిత్రమైనవని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో కాలం చేసిన పెద్దలకు మనం విడిచే తర్పణాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. ఈ 15 రోజుల్లో ఈ కార్యాలు చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదని ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం.