News September 6, 2025

అచ్చంపేట: రేపు ఉమామహేశ్వర ఆలయం మూసివేత

image

అచ్చంపేట మండలంలోని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అచ్చంపేట మండలం ఉమామహేశ్వర దేవస్థానాన్ని రేపు ఆదివారం ఉదయం ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు మూసి వేయడం జరుగుతుందని ఆలయ ఛైర్మన్ బీరం మాధవ రెడ్డి, ఈవో శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Similar News

News September 8, 2025

పరవాడ డెక్కన్ ఫార్మా కంపెనీలో ప్రమాదం.. కెమిస్ట్ మృతి

image

పరవాడ ఫార్మాసిటీ పరిధిలో గల డెక్కన్ రెడీమేడీస్ పరిశ్రమలో ఈనెల 5న విషవాయువు పీల్చి తీవ్ర అస్వస్థతకు గురైన సీనియర్ కెమిస్ట్ ఎల్.పోల్ నాయుడు గాజువాక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలాన్ని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి పరిశీలించి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News September 8, 2025

కలికిరికి మాజీ సీఎం రాక నేడు

image

మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి ఇవాళ రానున్నారు. రెండు రోజులు ఇక్కడే బస చేస్తారని ఆయన పీఏ కృష్ణప్ప తెలిపారు. సోమ, మంగళవారాల్లో లోకల్‌గా జరిగే పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్తారన్నారు.

News September 8, 2025

లిక్కర్ కేసు నిందితులకు నోటీసులు!

image

AP: లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు ACB కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సిట్ హైకోర్టులో సవాలు చేసింది. విచారణ చేపట్టిన HC బెయిల్‌పై విడుదలైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ACB కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం చట్ట విరుద్ధమని సిట్ తరఫు న్యాయవాది వాదించారు. మిగిలిన నిందితులకు ఇలా బెయిల్ ఇవ్వొద్దని కోరారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.