News September 6, 2025

ఈఎంఆర్‌ఎస్ క్రీడా పోటీలు పకడ్బందీగా నిర్వహించాలి: మంత్రి

image

EMRS క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం కోనరావుపేట మండలం మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగిన 5వ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలక్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా పాల్గొన్నారు. విద్యార్థులకు క్రీడల ప్రాముఖ్యతను వివరించారు.

Similar News

News September 7, 2025

చంద్రుడిని చూశారా?

image

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రక్రియ ప్రారంభమైంది. వెలుగులు ప్రసరిస్తూ ప్రకాశవంతంగా మెరిసిపోతున్న చందమామను మెల్లగా చీకటి కమ్మేస్తోంది. 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మొత్తం 82 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇప్పటికే దేశ ప్రజలు ధగధగా మెరుస్తున్న చంద్రుడిని చూస్తూ పులకరిస్తున్నారు. మరి మీరు చందమామను చూశారా?

News September 7, 2025

ఆదిలాబాద్: బెట్టింగ్‌తో జీవితం నాశనం చేసుకోవద్దు..!

image

ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన ఓ బ్యాంకు క్యాషియర్ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై దొంగగా మారి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే పలువురు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈనెల 9న ఆసియా కప్ టీ 20 క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో యువత బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి బెట్టింగ్ అలవాటైతే దానిని వదిలించుకోవడం చాలా కష్టమని పేర్కొంటున్నారు.

News September 7, 2025

జగిత్యాల కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

image

పింఛన్ల పెంపు కోసం మంగళవారం జరగనున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని MRPS అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ పిలుపునిచ్చారు. నేడు జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, BD కార్మికులకు పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటికీ పెంచలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహిళల వివరాలను సేకరించారు.