News September 6, 2025
HYD: నంది వాహనం ఎక్కిన ‘శివ’పుత్రుడు

వినాయక నిమజ్జనోత్సవంలో ‘శివ’పుత్రులు దర్శనమిచ్చారు. అవును.. హిమాయత్‌నగర్‌లో ఈ దృశ్యం భక్తులను కనువిందు చేసింది. శనివారం ట్యాంక్‌బండ్‌కు ఎడ్లబండి మీద ఓ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చారు. రథసారథిగా శివుడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంది వాహనం ఎక్కి గణపయ్య వస్తున్నాడు అంటూ భక్తులు పరవశించిపోయారు. ఈ వినూత్న ఆలోచన బాగుంది కదూ.
Similar News
News September 8, 2025
‘దానం’ డిస్‌క్వాలిఫికేషన్ ఎపిసోడ్.. కాంగ్రెస్ ప్లాన్- బీ?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు తప్పించేందుకు కాంగ్రెస్ ప్లాన్-బీ రచిస్తున్నట్లు సమాచారం. దానంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులతో అధిష్ఠానం చర్చించినట్లు తెలిసింది. ఈ విషయంపై గాంధీ భవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
News September 8, 2025
ములుగు: ‘లంబాడీలను ST జాబితా నుంచి తొలగించొద్దు’

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించారు. లంబాడీలను ST జాబితా నుంచి తొలగించాలన్న కోర్టు విచారణపై నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో నాయకులు, గ్రామస్థులు పాల్గొని తమ హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 9న చలో వరంగల్ శాంతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.
News September 8, 2025
ఏటూరునాగారం: ప్రారంభమైన బ్యాటరీ టెస్టులు

ఏటూరునాగారం గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో స్పోర్ట్స్ స్కూల్ 5వ తరగతి అడ్మిషన్ల కోసం బ్యాటరీ టెస్టులు జోరుగా కొనసాగుతున్నాయి. ముఖ్యఅతిథిగా ఆర్సీవో పాల్గొనగా, ప్రిన్సిపల్, PET, PEDS సిబ్బంది పర్యవేక్షణలో టెస్టులు జరుగుతున్నాయి. ఈ ఎంపిక ప్రక్రియ ఈరోజు, రేపు మాత్రమే కొనసాగనుంది. ఉదయం నుంచే విద్యార్థులు ఒక్కొక్కరుగా హాజరవుతుండగా, అవసరమైన పత్రాలతో రావాలని, క్రమశిక్షణ పాటించాలని అధికారులు సూచించారు.