News September 6, 2025
ఓరుగల్లు: భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది: మంత్రి

కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మక దేవాలయాలు మన ఓరుగల్లులో అధికంగా ఉన్నందున వాటిని పునరుద్ధరించి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు ఆలయాలను మంత్రి సందర్శించి ఈరోజు పూజలు చేశారు. దశలవారీగా అన్ని ఆలయాల అభివృద్ధి, నవీకరణ, పునరుద్ధరణ చేపడుతామని మంత్రి చెప్పుకొచ్చారు.
Similar News
News September 8, 2025
మంచిర్యాల: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రఘునాథ్

మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణ, ఇతర పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుకై పోరాటం చేస్తామని రఘునాథ్ పేర్కొన్నారు. రఘునాథ్ నియామకంపై పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
News September 8, 2025
ADB: సిమెంట్ పరిశ్రమపై చిగురించిన ఆశలు

ఆదిలాబాద్‌లోని సిమెంట్ పరిశ్రమపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. సీసీఐ తిరిగి పునరుద్ధరించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ కోరారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో సీసీఐ పునరుద్ధరణపై చర్చ జరిగింది. సీసీఐ పరిశ్రమ ఏర్పాటు అవశ్యకత ఉపాధి తదితర విషయాలను మంత్రితో పాటు పరిశ్రమల శాఖకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.
News September 8, 2025
SRD: అమ్మ ఒడికి గణపయ్యా.. తాము తక్కువేం కాదయ్యా!

ఈ సృష్టికి జన్మ స్వరూపం స్త్రీ. అలాంటి మహిళలు ఏకమై గణనాథుడికి ప్రతిష్ఠించారు. మొదటి పూజ నుంచి చివరి రోజు వరకు వినాయకుడికి పూజ చేశారు. నిమజ్జన కార్యక్రమంలో కోలాటం వేస్తూ ఊరేగించారు. చివరకు గణపయ్యను ఆ గంగమ్మ ఒడిలోకి చేర్చించారు. రామచంద్రపురంలోని మహిళలు చేసిన అద్భుత దృశ్యాలను చూసి భక్తులందరూ ఆశ్చర్యపోయారు. మగవారికి తాము తక్కువేం కాదు అని నిరూపించారు.