News September 6, 2025
కామారెడ్డి: ఈ నెల 12లోగా నివేదిక అందించాలి: కలెక్టర్

జిల్లాలో కురిసిన అధిక వర్షాల వల్ల జరిగిన నష్టానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 12వ తేదీలోగా నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్, సబ్ కలెక్టర్, RDO, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, అగ్రికల్చర్, హౌసింగ్, RWS, విద్యుత్, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
Similar News
News September 8, 2025
విశాఖ: సెప్టెంబర్ 10న స్థాయీ సంఘాల సమావేశం

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు సెప్టెంబర్ 10న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్నాయని జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర ఆధ్వర్యంలో వి.సి.హాల్ సమావేశ మందిరంలో 1-7వ స్థాయీ సంఘాలు వేర్వేరుగా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య జరుగుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.
News September 8, 2025
ములుగు: వాట్సాప్ చాట్ బాట్ ద్వారా విద్యుత్ ఫిర్యాదులు

విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం TGNPDCL ఆధ్వర్యంలో వాట్సాప్ చాట్ బాట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు డీఈ నాగేశ్వరరావు ఈరోజు తెలిపారు. వినియోగదారులు 7901628348 నంబర్‌కు హాయ్ పంపితే కంప్లైంట్ నమోదు, ట్రాక్, ఏజెంట్‌తో చాట్ వంటి సేవలు పొందవచ్చన్నారు. కంప్లైంట్‌కు ప్రత్యేక ID సృష్టించి SMS ద్వారా మెసేజ్ వస్తుందన్నారు. అదేవిధంగా 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News September 8, 2025
భూపాలపల్లి: న్యాయం చేయాలని మాలమహానాడు డిమాండ్

జీవో నంబర్ 99ను రద్దు చేయాలని, 26 ఉపకులాలు ఉన్న మాల కులానికి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు MLA క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్సనల్ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జెల్లా ప్రభాకర్, కె.రాజన్న, జంజర్ల సురేశ్, దండే రణపతి, కేశవులు పాల్గొన్నారు.