News September 7, 2025

కాజీపేటలో 32 అడుగుల మట్టి గణపతి నిమజ్జనం

image

కాజీపేట డీజీల్ కాలనీలో శనివారం 32 అడుగుల మట్టి గణపతిని స్థాపించిన చోటనే నిమజ్జనం చేశారు. శ్రీసాయి యూత్ ఆధ్వర్యంలో 32 అడుగుల మట్టి గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. వేలం పాటలో రూ.38,016కు నరసింగ రావు అనే భక్తుడు లడ్డూను దక్కించుకున్నాడు. ఫైర్ ఇంజిన్ సహాయంతో గణేశ్ నిమజ్జనం పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News September 8, 2025

నిజామాబాద్: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

image

రాజీ మార్గమే ఉత్తమ మార్గమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ట్రాఫిక్, చిన్నపాటి క్రిమినల్, సివిల్ వివాదాల కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని సీపీ తెలిపారు. కేసుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

News September 8, 2025

8 కిలోల బరువు తగ్గిన హిట్‌మ్యాన్.. ఎలా అంటే?

image

ఫిట్‌గా మారేందుకు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 8 కిలోల బరువు తగ్గినట్లు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండో తెలిపారు. ఐపీఎల్ తర్వాత 2-3 నెలల్లోనే డైట్, కఠోర సాధన చేసి వెయిట్ లాస్ అయినట్లు వెల్లడించారు. ఇందుకు ఆయన ఎలాంటి ఫ్యాషన్ డ్రగ్స్ వాడలేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కొందరు బరువు తగ్గేందుకు GLP-1 మందును వాడారు. కానీ హిట్‌మ్యాన్ మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదని పేర్కొన్నారు.

News September 8, 2025

అనంత: జిల్లాలో జ్వర పీడిత కేసులు

image

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 600 నుంచి 800 మధ్య జ్వర పీడితులు ఉన్నట్లు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అనంతపురం GGHలో 1,267 బెడ్స్ ఉన్నాయని చెప్పారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. రోగులకు ఇబ్బంది లేకుండా బెడ్స్ కేటాయిస్తున్నామని అన్నారు. నార్పల, పెద్దవడుగూరు, యాడికి, బెలుగుప్ప, కళ్యాణదుర్గం ప్రాంతాల నుంచి జ్వర కేసులు వస్తున్నాయని తెలిపారు.