News September 7, 2025
NZB: పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా బందోబస్తు పరిశీలన

నిజాముబాద్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన రథోత్సవ వేడుకలు కన్నుల పండువ కొనసాగింది. ఇందు కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థను సీపీ సాయి చైతన్య ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడూ పరిస్థితిని పరిశీలించారు. ఈ మేరకు నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వినాయక రథోత్సవ వేడుకలను వీక్షించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టిగా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
Similar News
News September 7, 2025
నిజామాబాద్‌లో చంద్రగ్రహణం

నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 8:58 గంటలకు పెనుమంట్ర దశతో ప్రారంభమైంది. పాక్షిక గ్రహణం రాత్రి 9:57 గంటలకు మొదలైంది. సంపూర్ణ గ్రహణం 12:22 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుందని జ్యోతిష పండితులు తెలిపారు.
News September 7, 2025
నిజామాబాద్: SRSP 8 వరద గేట్ల ఓపెన్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు 8 స్పిల్వే వరద గేట్లను ఓపెన్ చేశారు. వాటి ద్వారా 25 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 52,840 క్యూసెక్కుల నీరు వస్తుండగా వరద గేట్లు, ఇతర కాల్వల ద్వారా 53,685 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
News September 7, 2025
నిజామాబాద్: బాస్కెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి నరేష్

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు బొబ్బిలి నరేష్ బాస్కెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా సేవలందించాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. 30 ఏళ్లుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో సేవలు అందించడంతో ఈ అవకాశం వచ్చిందన్నారు. ఆయన్ను పలువురు అభినందించారు.