News September 7, 2025

టర్మినేట్‌ అయిన 43 మంది పునఃనియామకం

image

సింగరేణిలో జేఎంఈటీలుగా చేరి టెర్మినేట్‌ అయిన 43 మందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు సీఎండీ ఎన్‌.బలరాం నాయక్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీరంతా విధులకు గైర్హాజరవడం, ధ్రువపత్రాలను సమర్పించకపోవడం వల్ల విధుల నుంచి తొలగించడం జరిగిందన్నారు. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా వీరిని తిరిగి తీసుకుంటున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు.

Similar News

News September 8, 2025

భారత్ రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లండ్

image

అత్యధిక పరుగుల తేడాతో వన్డే మ్యాచ్ గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. సౌతాఫ్రికాతో జరిగిన <<17643575>>మూడో వన్డేలో<<>> ఆ జట్టు 342 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమ్ ఇండియా 317 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. 2023లో ఆ జట్టు నెదర్లాండ్స్‌పై 309 రన్స్ తేడాతో గెలుపొందింది.

News September 8, 2025

నేడు CPGET-2025 ఫలితాలు

image

TG: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET-2025) ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నారు. గత నెల 6 నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షకు 45,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. CPGET <>వెబ్‌సైట్‌లో<<>> ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.

News September 8, 2025

జైల్లో లైబ్రరీ క్లర్క్‌గా ప్రజ్వల్ రేవణ్ణ

image

పనిమనిషిపై అత్యాచారం కేసులో హాసన్ (కర్ణాటక) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు యావజ్జీవ శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరప్పన ఆగ్రహార జైలులో ఉన్న ఆయనకు అధికారులు లైబ్రరీ క్లర్క్ పనిని కేటాయించారు. ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటి వివరాలు నమోదు చేయడమే పని. రోజుకు ₹522 జీతంగా ఇస్తారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు నెలకు కనీసం 12, వారానికి 3 రోజులు పని చేయాలనే నిబంధన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.