News September 7, 2025

మెదక్‌: 24 గంటల్లోనే విద్యుత్ పునరుద్ధరణ

image

భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే పునరుద్ధరించినట్లు టీజీఎస్​సీపీడీసీఎల్​ చీఫ్​ ఇంజనీర్​ బాలస్వామి తెలిపారు. మెదక్‌లోని ఎస్ఈ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 26 నుంచి 30 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 115 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన చెప్పారు.

Similar News

News September 8, 2025

చేగుంట: చెట్టును ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

image

చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట నుంచి బోనాల వైపు వెళ్తున్న ఒక కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రామాయంపేట మండలం శివాయపల్లికి చెందిన సాయితేజ్ (23) మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News September 8, 2025

మెదక్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

పాపన్నపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.

News September 7, 2025

మెదక్: ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం: ఎస్పీ

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు తెలిపారు. 11 రోజుల పాటు జిల్లా అంతటా పోలీస్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో 24 గంటలు అప్రమత్తంగా పనిచేయడంతో అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో వినాయక ఉత్సవాలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సిబ్బందిని అభినందించారు.