News September 7, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> రేపు పాలకుర్తి సోమేశ్వర ఆలయం మూసివేత
> జనగామ: యూరియా కోసం రైతుల ఇక్కట్లు
> జనగామలో బంజారాల రౌండ్ టేబుల్ సమావేశం
> జనగామ: మా సార్‌ను పంపించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం: విద్యార్థులు
> జవహర్ నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం
> పాలకుర్తి: రాష్ట్ర స్థాయి పోటీలకు ఉపాధ్యాయుడు ఎంపిక
> జనగామ నుంచి లండన్‌కు గణపతి లడ్డూ
> కోర్టుకు హాజరైన జనగామ ఉద్యమకారులు
Similar News
News September 8, 2025
KMR: హైవేపై వేగంగా వెళ్తున్నారా జాగ్రత్త

వాహనాల వేగాన్ని నియంత్రించి, ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ప్రధాన ఉద్దేశమని SP రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. ఎన్‌హెచ్-44లోని సదాశివనగర్ లిమిట్స్‌లో స్పీడ్ లేజర్ గన్స్‌ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 3 స్పీడ్ లేజర్ గన్స్ పని చేస్తున్నాయని ఎస్పీ చెప్పారు. NH-44, 161, రాష్ట్ర రహదారులపై అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి చలానాలు జారీ చేస్తామన్నారు.
News September 8, 2025
హనుమకొండ: నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేశారు: MLA

నమ్మిన సిద్ధాంతం కోసం సురవరం సుధాకర్ రెడ్డి జీవితాంతం పనిచేశారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండలో ఈరోజు నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఎమ్మెల్యే హాజరయ్యారు. పేదలు, కార్మికులు, రైతుల కోసం ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమని ఎమ్మెల్యే నాగరాజు కొనియాడారు.
News September 8, 2025
‘దానం’ డిస్‌క్వాలిఫికేషన్ ఎపిసోడ్.. కాంగ్రెస్ ప్లాన్- బీ?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు తప్పించేందుకు కాంగ్రెస్ ప్లాన్-బీ రచిస్తున్నట్లు సమాచారం. దానంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులతో అధిష్ఠానం చర్చించినట్లు తెలిసింది. ఈ విషయంపై గాంధీ భవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.