News September 7, 2025
ధవలేశ్వరం: తగ్గుముఖం పట్టిన వరద

ధవలేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శనివారం రాత్రి 9 గంటలకు 7,38,035 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సాగునీటి అవసరాల కోసం 14,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News September 8, 2025
బిక్కవోలు: భార్య కాపురానికి రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

భార్య కాపురానికి రాలేదని ఓ వ్యక్తి మనస్తాపం చెంది కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం బిక్కవోలులో జరిగింది. ఎస్సై రవివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కవోలుకు చెందిన రవికుమార్‌కు సోనితో వివాహమైంది. 3 నెలల కిందట భర్తపై కోపంతో మండపేటలోని ఆమె పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో రవి సామర్లకోట కాలువలో దూకాడు. అదే మార్గంలో వెళ్లున్న ఎస్సై, డ్రైవర్ అతనిని కాపాడారు.
News September 8, 2025
రాజమండ్రిలో నేడు యథాతథంగా పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

రాజమండ్రిలో నేడు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథాతదంగా జరగనుందని కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు నేరుగా సమర్పించుకోవచ్చుని అన్నారు. అర్జీలు ముందుగా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
News September 8, 2025
కడియం: అమోనియా, నానో యూరియాలను రైతులు వాడుకోవాలి

కడియం, రాజమండ్రి రూరల్ మండలంలో తూ.గో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నేతల మల్లికార్జున రావు ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతుల పొలాలను ఆదివారం పరిశీలించారు. రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. యూరియా తగు పరిమాణంలోని మాత్రమే వాడాలని అధికంగా వాడితే పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుందని వారికి చెప్పారు. అమోనియా, నానో యూరియాలను రైతులు తమ పొలంలో వాడుకొని పెట్టుబడి తగ్గించుకోవాలన్నారు.