News September 7, 2025

ADB: నిమజ్జనం ప్రశాంతంగా చేయాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

image

గణపతి నవరాత్రి ఉత్సవాలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి, నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలిచ్చారు. ప్రజలతో మర్యాదగా మాట్లాడి, సామరస్యంగా వ్యవహరించాలని ఆయన కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, 24 గంటలు కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

Similar News

News September 8, 2025

ADB: విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన సుగుణ

image

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సోమవారం జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలు తీరు, రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై అధిష్టానంతో సుగుణ వివరించారు.

News September 8, 2025

ఆదిలాబాద్: రైల్వే సమస్యలను పరిష్కరించాలి

image

ఆదిలాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్, ఫిట్ లైన్, ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్ కోరారు. ఈ మేరకు సోమవారం నాందేడ్ రైల్వే డివిజనల్ మేనేజర్ ప్రదీప్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు జనగం సంతోష్, కార్యదర్శి సుభాష్, అమర్ జార్జ్ పాల్గొన్నారు.

News September 8, 2025

రేపటి లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: DIEO

image

ఆదిలాబాద్ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానాన్ని డీఐఈఓ జాదవ్ గణేష్ కుమార్ ప్రారంభించారు. మొత్తం 6,274 మంది విద్యార్థులకు గాను 3,599 మంది (57 శాతం) మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగతా విద్యార్థులు ఈ నెల 9లోగా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.