News September 7, 2025

ప్రకాశం వైద్య ఆరోగ్య శాఖ ఖాళీ సీట్ల.. మెరిట్ లిస్ట్ విడుదల!

image

జిల్లాలో గల పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సెస్, ఎఫ్ఎన్ఓ, ఎస్ఏడబ్ల్యు పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల మెరిట్, తిరస్కరణ లిస్ట్ విడుదల చేసినట్లు డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్వో కార్యాలయం శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు http://Prakasam.ap.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.

Similar News

News September 8, 2025

ఒంగోలులో ప్రశాంతంగా ముగిసిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు

image

ఒంగోలులో ఆదివారం అటవీశాఖ పోస్టుల భర్తీకై నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DRO ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 10 పరీక్ష కేంద్రాలను DRO ఆదివారం సందర్శించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 1153 మందికి గాను 901 మంది హాజరైనట్లు, మిగిలిన పోస్టులకు 7052 మందికి గాను 5642 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు.

News September 7, 2025

ప్రకాశం ప్రజలకు కలెక్టర్ ముఖ్య సూచన

image

ఒంగోలు కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. మండల, డివిజన్ స్థాయిలో కూడా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అర్జీలను Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించారు.

News September 7, 2025

ప్రకాశంలో పలు ఆలయాలు మూసివేత..!

image

ప్రకాశం జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాల దర్శనాలను ఆలయాల ఈవోలు నిలిపివేశారు. నేడు చంద్రగ్రహణం కారణంగా దర్శనాల నిలిపివేతపై ఆలయాల అధికారులు ప్రకటనలు జారీ చేశారు. ప్రధానంగా జిల్లాలోని భైరవకోనలో వెలసిన శ్రీ భైరవేశ్వర ఆలయం, త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం, మార్కాపురంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం, పలు ఆలయాల దర్శనాలను నిలిపివేశారు. సోమవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం దర్శనాలకు అనుమతిస్తారు.