News April 3, 2024
ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆస్తి కల్పించాం: జగన్

AP: రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆస్తి కల్పించామని సీఎం జగన్ అన్నారు. ‘రూ.3 వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఎన్నో పథకాలతో అక్కచెల్లెమ్మలకు అండగా ఉన్నాం. మహిళలకు ఇచ్చిన ఒక్కో ఇంటి విలువ రూ.లక్షల్లో ఉంటుంది. ఇప్పటివరకు రూ.2.70 లక్షల కోట్లు మీ ఖాతాల్లో నేరుగా వేశాం. 130 సార్లు మీ బిడ్డ జగన్ బటన్ నొక్కారు. నా కోసం రెండు సార్లు బటన్లు నొక్కండి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 22, 2025
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. భారత్‌లో 3 రోజులు సంతాప దినాలు

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల గౌరవ సూచకంగా కేంద్రం మూడ్రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ఈ నెల 22, 23 తేదీలు, అలాగే అంత్యక్రియలు నిర్వహించే రోజును కూడా సంతాప దినంగానే ప్రకటించింది. ఈ మూడ్రోజులు జాతీయ జెండాను సగం ఎత్తులోనే ఎగరవేయాలంది. ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొంది. 88 ఏళ్ల వయసులో పోప్ ఫ్రాన్సిస్ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
News April 22, 2025
పోలీసు కస్టడీకి గోరంట్ల మాధవ్

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రెండ్రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు 5 రోజులు కోరగా.. కోర్టు రెండ్రోజులు అనుమతించింది. గోరంట్లను ఈ నెల 23, 24 తేదీల్లో పోలీసులు విచారించనున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై గోరంట్ల దాడికి యత్నించారని కేసు నమోదైంది. ప్రస్తుతం గోరంట్ల రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
News April 22, 2025
MI ఆటగాళ్లలో స్ఫూర్తినింపిన పొలార్డ్!

నిన్న రాత్రి CSKపై మ్యాచ్‌కు ముందు MI ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేలా స్పీచ్ ఇచ్చినట్లు పొలార్డ్ తెలిపారు. ‘ఆటగాళ్లతో మాట్లాడేందుకు మహేల నాకు ఛాన్స్ ఇచ్చారు. గడచిన రెండేళ్లుగా చెన్నై ఆటగాళ్లకు ‘బాగా ఆడారు’ అని చెప్పడమే సరిపోయింది. ఈసారి అలా ఉండకూడదు అని అన్నాను. ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడి విజయాన్ని అందించారు’ అని చెప్పుకొచ్చారు. స్పిన్నర్లను ఆడేందుకే సూర్యను 3వ స్థానంలో పంపించినట్లు ఆయన వివరించారు.