News September 7, 2025
కర్నూలులో ఏఐ టెక్నాలజీతో 100 సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు: మంత్రి

కర్నూలులో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏఐ టెక్నాలజీతో కూడిన 100 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. శనివారం ప్రభుత్వ అతిథి గృహంలో కెమెరాల ఏర్పాటుకు కుడా నిధులు రూ.29.84 లక్షల చెక్కును ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు మంత్రి అందజేశారు. కలెక్టర్ రంజిత్ బాషా, జేసీ నవ్య, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Similar News
News September 8, 2025
ఫిర్యాదులపై విచారణ చేసి న్యాయం చేస్తాం: కర్నూలు SP

బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని జిల్లా వ్యాప్తంగా వచ్చిన 98 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. త్వరితగతిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాధితులకు హామీ ఇచ్చారు.
News September 8, 2025
నేడు కర్నూలుకు వైఎస్ షర్మిల

ఉల్లి, టమాటా ధరల పతనంతో నష్టపోతున్న రైతులకు మద్దతుగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు కర్నూలుకు రానున్నారని కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ షేక్ జిలానీ బాషా తెలిపారు. ఉదయం 11 గంటలకు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పార్టీ శ్రేణులు ఆమెకు స్వాగతం పలుకుతారని పేర్కొన్నారు. అనంతరం కొత్త బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డులో రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటారని చెప్పారు.
News September 8, 2025
ఈనెల 9న కర్నూలు జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలు

ఈనెల 9న ఉదయం 10 గంటలకు కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో సెపక్ తక్రా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం కార్యదర్శి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీల్లో ఉరవకొండలో (సబ్ జూనియర్స్) అలాగే 27, 28 తేదీల్లో ఒంగోలులో (సీనియర్స్) విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.