News September 7, 2025

పింఛన్ రాక వృద్ధురాలి భిక్షాటన

image

నందికొట్కూరులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వృద్ధురాలు భిక్షాటన చేసింది. జూపాడు బంగ్లా మండలం పారుమంచాలకు చెందిన మునుపాటి మరియమ్మ భర్త ఆశీర్వాదానికి పెన్షన్ వచ్చేది. భర్త చనిపోయి 2 ఏళ్లైనా తనకు పెన్షన్ రాలేదని మరియమ్మ వాపోయింది. అధికారులు మరణ ధ్రువీకరణ పత్రంలో తప్పుగా ధ్రువీకరించడంతో తనకు పింఛన్ రావడం లేదని విలపించింది. తనకు పెన్షన్ ఇప్పించి న్యాయం చేయాలని అధికారులను వేడుకొంది.

Similar News

News September 8, 2025

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: భూపాలపల్లి ఎస్పీ

image

ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో మొత్తం 15 వినతి పత్రాలు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును ఎస్పీ స్వయంగా పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

News September 8, 2025

నేపాల్‌లో హింస.. హోంమంత్రి రాజీనామా

image

నేపాల్‌లో <<17651342>>హింసాత్మక ఘటనలు<<>> జరుగుతుండటంతో ఆ దేశ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపారు. సోషల్ మీడియా నిషేధంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అక్కడి యువత ఇవాళ ఆందోళనకు దిగింది. పోలీసులు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. 250 మందికి పైగా గాయాలయ్యాయి.

News September 8, 2025

భూపాలపల్లి: ‘అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి’

image

ఆది కర్మయోగి అభియాన్ మిషన్‌ను గ్రామ స్థాయిలో మూవ్‌మెంట్ లాగా అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం భూపాలపల్లి ఐడీఓసీలో ఆది కర్మయోగి అభియాన్ మిషన్‌పై అధికారులతో డిస్ట్రిక్ ప్రాసెస్ ల్యాబ్ అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 37 గిరిజన గ్రామాలను ఆదికర్మ యోగి అభియాన్ మిషన్ కింద ఎంపిక చేసినట్లు తెలిపారు.