News September 7, 2025
ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ!

TG: ఈ నెల 15న కామారెడ్డిలో BC డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. BCలకు 42% శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఈ సభకు ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలకు ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం. మరోవైపు రేపు HYDలో జరిగే PCC విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.
Similar News
News September 8, 2025
భారీగా పడిపోయిన ఉల్లి ధరలు!

ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. TGలో కిలోకు రూ.5-16 మాత్రమే దక్కుతోంది. వినియోగదారులకు మాత్రం రూ.25-45 మధ్య లభిస్తోంది. ఫలితంగా మధ్యవర్తులే లాభపడుతున్నారు. APలో క్వింటా కనిష్ఠంగా రూ.501, గరిష్ఠంగా రూ.1,249 పలుకుతోంది. రైతుకు కేజీకి రూ.5-12 మధ్యే దక్కుతోంది. కొన్ని మార్కెట్లలో ఉల్లి నిల్వలు పేరుకుపోయి కొనుగోళ్లూ నిలిచిపోయాయి. ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
News September 8, 2025
ఏపీలో BPCL ప్రాజెక్టు.. ToR ప్రిపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్

ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) 9 MMTPA గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ&పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(ToR) ప్రిపరేషన్‌కు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. నెల్లూరు(D) చేవూరులో ₹1.03లక్షల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. పబ్లిక్ హియరింగ్ నిర్వహించి, ఇతర వివరాలతో నివేదిక సమర్పించాలని BPCLకు నిపుణుల అంచనా కమిటీ సూచించింది.
News September 8, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TGలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, యాదాద్రి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు APలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.