News September 7, 2025
నేడే చంద్ర గ్రహణం.. టైమింగ్స్ ఇవే

నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. రాత్రి.8.58 గంటలకు గ్రహణం ప్రారంభమై, రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12.22 గంటల వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. రేపు తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం ముగుస్తుంది. భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లోనూ చంద్రగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను ఇవాళ కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు.
Similar News
News September 8, 2025
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి మరో షాక్!

స్విగ్గీ, జొమాటో <<17604591>>ఇప్పటికే<<>> డెలివరీ ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేసేవారిపై మరింత భారం పడనుంది. జీఎస్టీ వల్ల జొమాటో కస్టమర్ల నుంచి ఆర్డరుకు రూ.2, స్విగ్గీ కొనుగోలుదార్ల నుంచి రూ.2.6 చొప్పున అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది.
News September 8, 2025
గ్రహణం మళ్లీ ఎప్పుడంటే?

నిన్న రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం <<17644262>>కనువిందు<<>> చేసింది. అయితే రెండు వారాల తర్వాత మరో గ్రహణం ఏర్పడనుంది. ఈనెల 21న(ఆదివారం) సూర్యగ్రహణం సంభవిస్తుంది. రాత్రి 11 గంటల నుంచి 22వ తేదీ తెల్లవారుజామున 3.23 గంటల వరకు ఇది కొనసాగుతుంది. కానీ దీని ప్రభావం మన దేశంలో అంతగా ఉండదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.
News September 8, 2025
బీసీలే టార్గెట్‌గా కవిత, మల్లన్న పార్టీలు?

TG: రాష్ట్రంలో BC కాన్సెప్ట్‌తో 2 కొత్త పార్టీలు ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ నెల 17న పార్టీ పేరు, జెండాను ఆవిష్కరిస్తారని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని ప్రకటించి జెండా, ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత యోచిస్తున్నట్లు సమాచారం. బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి వీరిద్దరూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.