News September 7, 2025
ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమా ఇప్పట్లో ఉంటుందా?

ప్రభాస్‌తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీగా ఉందని, హీరో డేట్స్ దొరకడమే ఆలస్యమని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’తో బిజీగా ఉన్నారు. తర్వాత స్పిరిట్, కల్కి-2, సలార్-2 లైన్‌లో ఉన్నాయి. అటు ప్రశాంత్ ‘జై హనుమాన్’ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా రావడానికి మరింత టైమ్ పట్టే ఛాన్సుంది.
Similar News
News September 8, 2025
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి మరో షాక్!

స్విగ్గీ, జొమాటో <<17604591>>ఇప్పటికే<<>> డెలివరీ ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేసేవారిపై మరింత భారం పడనుంది. జీఎస్టీ వల్ల జొమాటో కస్టమర్ల నుంచి ఆర్డరుకు రూ.2, స్విగ్గీ కొనుగోలుదార్ల నుంచి రూ.2.6 చొప్పున అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది.
News September 8, 2025
గ్రహణం మళ్లీ ఎప్పుడంటే?

నిన్న రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం <<17644262>>కనువిందు<<>> చేసింది. అయితే రెండు వారాల తర్వాత మరో గ్రహణం ఏర్పడనుంది. ఈనెల 21న(ఆదివారం) సూర్యగ్రహణం సంభవిస్తుంది. రాత్రి 11 గంటల నుంచి 22వ తేదీ తెల్లవారుజామున 3.23 గంటల వరకు ఇది కొనసాగుతుంది. కానీ దీని ప్రభావం మన దేశంలో అంతగా ఉండదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.
News September 8, 2025
బీసీలే టార్గెట్‌గా కవిత, మల్లన్న పార్టీలు?

TG: రాష్ట్రంలో BC కాన్సెప్ట్‌తో 2 కొత్త పార్టీలు ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ నెల 17న పార్టీ పేరు, జెండాను ఆవిష్కరిస్తారని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని ప్రకటించి జెండా, ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత యోచిస్తున్నట్లు సమాచారం. బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి వీరిద్దరూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.