News September 7, 2025
నేడే చంద్ర గ్రహణం.. ఈ పనులు మానుకోండి

నేడు రాత్రి 9.58కి చంద్ర గ్రహణం మొదలుకానుంది. కానీ <<17628465>>సూతక కాల<<>> ప్రభావం మధ్యాహ్నం 12.57 నుంచే ఉంటుందని పండితులు చెబుతున్నారు. ‘ఈ సమయంలో ఆహారం తీసుకోవద్దు. వండుకోవద్దు. ముందే వండిపెట్టిన ఆహారంపై దర్భ గడ్డి/తులసి ఆకులు వేసి ఉంచాలి. లేదంటే కలుషితం అవుతుంది. గ్రహణ సమయంలో శుభకార్యాలు, పూజలు వద్దు. SEP 8, 1.26AMకి గ్రహణం ముగుస్తుంది. ఆ తర్వాత దానాలు చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు.
Similar News
News September 7, 2025
హైదరాబాద్‌కు ‘గోదావరి’.. రేపు సీఎం శంకుస్థాపన

TG: మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-2, 3లకు సీఎం రేవంత్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రూ.7,360 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మల్లన్నసాగర్ నుంచి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు తరలించనున్నారు. జీహెచ్ఎంసీ, ORR పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలకు తాగునీటి సరఫరాకు చేపట్టిన మరో ప్రాజెక్టును ఆయన ప్రారంభిస్తారు.
News September 7, 2025
కాంగ్రెస్ పాలనలో దీనస్థితికి గురుకులాలు: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ పాలనలో గురుకులాలు దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్ రావు Xలో రాసుకొచ్చారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల జీతాలు ఇవ్వలేదని ఫైరయ్యారు. KCR హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ పాలనలో నరక కూపాలుగా మారాయని దుయ్యబట్టారు.
News September 7, 2025
ఎట్టకేలకు మణిపుర్‌కు ప్రధాని మోదీ?

ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెల 13 లేదా 14న ఆయన అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది. పీఎం పర్యటనకు సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మణిపుర్ అల్లర్లు చెలరేగినప్పటి నుంచి మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. దీంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.