News September 7, 2025
త్వరలో కేటీఆర్ జిల్లాల పర్యటన!

TG: లోకల్ బాడీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో, 13న గద్వాలలో ఆయన పర్యటిస్తారు. దసరాలోగా వీలైనన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇటు స్థానిక సంస్థలతో పాటు అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 8, 2025
రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

రేపు జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు NDA, INDI కూటమి సిద్ధమవుతున్నాయి. ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో విపక్ష ఎంపీలకు ఇండి కూటమి మాక్ పోలింగ్ నిర్వహించనుంది. దీనికి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. అటు AP మంత్రి నారా లోకేశ్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతుగా తమ TDP ఎంపీలతో సమావేశం కానున్నారు. మరోవైపు ఎన్నికకు BRS దూరంగా ఉండే అవకాశం ఉంది.
News September 8, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!

TG: స్టీల్, సిమెంట్‌పై GST 28% నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది. ఇంటి నిర్మాణానికి 180 సంచుల సిమెంట్ అవసరం కాగా సంచి ధర రూ.330-370గా ఉంది. GST తగ్గడం ద్వారా సంచిపై రూ.30 చొప్పున రూ.5,500 ఆదా అయ్యే అవకాశం ఉంది. అటు 1500 కిలోల స్టీల్ అవసరం పడుతుండగా కేజీ రూ.70-85 వరకు పలుకుతోంది. కేజీపై రూ.5 తగ్గినా రూ.7,500 ఆదా కానుంది. మొత్తం రూ.13వేల వరకు తగ్గనుంది.
News September 8, 2025
రష్యాపై మరిన్ని సుంకాలు: ట్రంప్

రష్యాపై మరిన్ని సుంకాలు విధిస్తామని US అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ‘రష్యాపై సెకండ్ ఫేస్ టారిఫ్స్‌కు సిద్ధంగా ఉన్నారా?’ అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నేను రేడీగా ఉన్నాను’ అని ఆయన సమాధానమిచ్చారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా అదనపు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వంటి దేశాలపై మరిన్ని సుంకాలు విధించాలని US ట్రెజరీ సెక్రటరీ<<17644290>> బెసెంట్<<>> కూడా అన్నారు.