News September 7, 2025

అక్టోబర్‌లో మోదీ-ట్రంప్ భేటీ?

image

ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చే నెలలో కలిసే అవకాశం ఉంది. అక్టోబర్ 26-28 వరకు మలేషియాలో ASEAN సమ్మిట్ జరగనుంది. ట్రంప్ ఆ సమావేశానికి వస్తున్నారని మలేషియా ప్రధాని కన్ఫామ్ చేశారు. కానీ మోదీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా న్యూయార్క్‌(US)లో ఈనెల 23 నుంచి 29 వరకు జరగనున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) హైలెవెల్ డిబేట్‌కు PM మోదీ <<17627443>>హాజరుకావడం<<>> లేదు.

Similar News

News September 8, 2025

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

image

రేపు జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు NDA, INDI కూటమి సిద్ధమవుతున్నాయి. ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో విపక్ష ఎంపీలకు ఇండి కూటమి మాక్ పోలింగ్ నిర్వహించనుంది. దీనికి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. అటు AP మంత్రి నారా లోకేశ్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతుగా తమ TDP ఎంపీలతో సమావేశం కానున్నారు. మరోవైపు ఎన్నికకు BRS దూరంగా ఉండే అవకాశం ఉంది.

News September 8, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!

image

TG: స్టీల్, సిమెంట్‌పై GST 28% నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది. ఇంటి నిర్మాణానికి 180 సంచుల సిమెంట్ అవసరం కాగా సంచి ధర రూ.330-370గా ఉంది. GST తగ్గడం ద్వారా సంచిపై రూ.30 చొప్పున రూ.5,500 ఆదా అయ్యే అవకాశం ఉంది. అటు 1500 కిలోల స్టీల్ అవసరం పడుతుండగా కేజీ రూ.70-85 వరకు పలుకుతోంది. కేజీపై రూ.5 తగ్గినా రూ.7,500 ఆదా కానుంది. మొత్తం రూ.13వేల వరకు తగ్గనుంది.

News September 8, 2025

రష్యాపై మరిన్ని సుంకాలు: ట్రంప్

image

రష్యాపై మరిన్ని సుంకాలు విధిస్తామని US అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ‘రష్యాపై సెకండ్ ఫేస్ టారిఫ్స్‌కు సిద్ధంగా ఉన్నారా?’ అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నేను రేడీగా ఉన్నాను’ అని ఆయన సమాధానమిచ్చారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా అదనపు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వంటి దేశాలపై మరిన్ని సుంకాలు విధించాలని US ట్రెజరీ సెక్రటరీ<<17644290>> బెసెంట్<<>> కూడా అన్నారు.