News September 7, 2025
విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే..!

విజయవాడలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.240, స్కిన్‌తో అయితే రూ.230కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.900 వద్ద స్థిరంగా ఉంది. చేపల్లో బొచ్చ రూ.230, రాగండి రూ.200గా విక్రయిస్తున్నారు. 30 కోడిగుడ్లు రూ.170కి అమ్ముతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News September 9, 2025
హైదరాబాద్‌లో పోలీస్ క్రికెట్ స్టేడియం..!

హైదరాబాద్ నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో కొత్త క్రికెట్ స్టేడియం రానుంది. పోలీస్ క్రికెట్ స్టేడియం (పీసీఎస్) నిర్మాణంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దీని కోసం అంబర్‌పేట, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. అయితే ఆరాంఘర్‌లో స్టేడియం నిర్మిస్తే మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పీసీఎస్‌ను క్రికెట్ ఆడుకునే వారికి అద్దెకు ఇవ్వాలని కూడా యోచిస్తున్నారు.
News September 9, 2025
బాసర ఆర్జీయూకేటీలో పట్టభద్రుల యోగ్యత శిక్షణ గేట్ తరగతులు ప్రారంభం

యంత్రశాస్త్ర పోటీ పరీక్షల సాధనా పరిషత్(ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ) సహకారంతో యంత్రశాస్త్ర పట్టభద్రుల యోగ్యతా పరీక్ష(గేట్))అంతర్జాల శిక్షణా తరగతులను బాసర ఆర్జీయూకేటీలో కళాశాల వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మాణాత్మక గేట్ శిక్షణా కార్యక్రమాలను అందించడానికి ఏ.సీ.ఈ అకాడమీ ఒక విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారన్నారు.
News September 9, 2025
మాజీ సీఎం కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలి: రాజాసింగ్

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్న కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను వేరే చోటికి తరలిస్తే సాగర్‌ను మంచినీటితో నింపవచ్చని సూచించారు.