News September 7, 2025
శ్రీకాకుళం: పరీక్షా కేంద్రాల పరిశీలన

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ జరగనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షల ఏర్పాట్లను శనివారం ఏపీపీఎస్సీ సభ్యుడు ఎన్. సోనీ వుడ్ పరిశీలించారు. జిల్లాలోని ముఖ్యమైన మూడు కేంద్రాలతో పాటుగా ఆయా అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Similar News
News September 8, 2025
శ్రీకాకుళం: విద్యార్థులకు గమనిక

ఏపీ పీజీ సెట్-2025 పరీక్షలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత చెందిన వారు వెబ్‌ఆప్షన్ ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని పలు కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ఇతర వివరాలకు సీఈటీఎస్. ఏపీఎస్‌సీహెచ్‌సీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్‌ను చూడవచ్చు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఈ నెల 8-15 వరకు జరగనుంది.
News September 8, 2025
యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. మరో వారం రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి విడత ఎరువులు వచ్చే అంచనా తేదీని గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు
News September 8, 2025
శ్రీకాకుళంలోయథాతథంగా గ్రీవెన్స్

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో నేడు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.