News September 7, 2025
KNR: మంత్రులూ.. జర రైతులను పట్టించుకోండి..!

ఉమ్మడి KNR జిల్లాలో ఓ పక్క భారీ వర్షాలతో పంట నష్టం, మరోపక్క యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతకు అండగా ఉంటూ భరోసా కల్పించాల్సిన మంత్రులు ఎక్కడున్నారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంట పరిహారం ఎప్పుడు ఇస్తారు? యూరియా కష్టాలు ఎప్పుడు తీరుస్తారు? అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా పట్టించుకోండంటూ వేడుకుంటున్నారు.
Similar News
News September 8, 2025
బాపట్ల: వృద్ధురాలిపై అత్యాచారం

బాపట్ల జిల్లా నగరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన యువకుడు తన స్నేహితులతో కలిసి ఈనెల 1వ తేదీ రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత మత్తులో తనకు నానమ్మ వరుసయ్యే 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. బంధువులు గమనించి వృద్ధురాలిని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తరఫున నగరం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందగా ఎస్ఐ భార్గవ్ కేసు నమోదు చేశారు.
News September 8, 2025
కడప జిల్లాలో తెరుచుకున్న ఆలయాలు

చంద్రగ్రహణం సందర్భంగా కడప జిల్లాలోని అన్ని ఆలయాలు మూత పడిన విషయం తెలిసిందే. గ్రహణం వీడటంతో ఇవాళ తెల్లవారుజామున ఆలయాలు తెరిచారు. ఒంటమిట్ట కోదండరామాలయంలో టీటీడీ అర్చకులు ఆలయ శుద్ధి చేశారు. తర్వాత సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జిల్లాలోని ఇతర ఆలయాల్లోనూ దర్శనాలు తిరిగి మొదలయ్యాయి.
News September 8, 2025
విశాఖలో మూగ బాలికపై అత్యాచారం!

AP: విశాఖలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ మూగ బాలికపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై CP శంఖబ్రత బాగ్చీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే పూర్తి వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. మద్యం మత్తులో యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.