News September 7, 2025
అరకు: ‘ఆ ప్రాజెక్టుతో 150 గ్రామాలు జలసమాధి’

5వ షెడ్యూల్ ఏరియాలో చేపట్టాలనుకునే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలు రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం అరకులోయ వచ్చిన రాష్ట్ర మంత్రి సంధ్యారాణికి వినతి పత్రాలు అందిచారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం డ్యాం నిర్మిస్తే అనంతగిరి, హుకుంపేట, అరకులోయ మండలాల్లో సుమారు 150 గిరిజన గ్రామాలు జలసమాధి అవుతాయని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు.
Similar News
News September 8, 2025
కడప జిల్లాలో తెరుచుకున్న ఆలయాలు

చంద్రగ్రహణం సందర్భంగా కడప జిల్లాలోని అన్ని ఆలయాలు మూత పడిన విషయం తెలిసిందే. గ్రహణం వీడటంతో ఇవాళ తెల్లవారుజామున ఆలయాలు తెరిచారు. ఒంటమిట్ట కోదండరామాలయంలో టీటీడీ అర్చకులు ఆలయ శుద్ధి చేశారు. తర్వాత సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జిల్లాలోని ఇతర ఆలయాల్లోనూ దర్శనాలు తిరిగి మొదలయ్యాయి.
News September 8, 2025
విశాఖలో మూగ బాలికపై అత్యాచారం!

AP: విశాఖలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ మూగ బాలికపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై CP శంఖబ్రత బాగ్చీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే పూర్తి వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. మద్యం మత్తులో యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
News September 8, 2025
జమ్మూకశ్మీర్‌లో భీకర కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. ఇద్దరు పారా మిలిటరీ జవాన్లకు గాయాలయ్యాయి. మరోవైపు ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ, J&K పోలీసులు, శ్రీనగర్ CRPF దళం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.