News September 7, 2025
భద్రాద్రి: ఆసుపత్రిలో డయాలసిస్ రోగికి HIV

కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటున్న ఓ వృద్ధుడికి HIV సోకిన ఘటన చోటుచేసుకుంది. మణుగూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే ఈ ఘటన జరిగిందని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే హెచ్‌ఐవీ సోకిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, రోగి గతంలో HYD, WGLలో కూడా చికిత్స తీసుకున్నారని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
Similar News
News September 8, 2025
విశాఖ జిల్లాలో 67.56% స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ పూర్తి

విశాఖ జిల్లాలో కేటాయించిన 5,17,155 స్మార్ట్ రైస్ కార్డులలో 67.56% పంపిణీ పూర్తయింది. మండలాల వారీగా అనందపురం 84.35%, భీమునిపట్నం 79.74%, సర్కిల్-III అర్బన్ 71.93%, సర్కిల్-I అర్బన్ 59.26% పూర్తి అయ్యాయి. మిగిలిన వారికి త్వరలోనే సచివాలయ సిబ్బంది/డీలర్ల ద్వారా అందజేస్తామని.. కార్డు వివరాలు epds పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ హరేంధీర ప్రసాద్ తెలిపారు.
News September 8, 2025
GWL: సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి- SP

సైబర్ వారియర్స్ ఎప్పటికప్పుడు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో DSP మొగిలయ్యతో సైబర్ వారియర్స్, D4C సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జిల్లా సైబర్ సెల్‌తో సమన్వయం చేసుకొని సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద కంటెంట్‌పై నిఘా ఉంచాలని, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఇంటెలిజెన్స్ సేకరణ వంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
News September 8, 2025
ఢిల్లీలో రేవంత్

TG: ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. రేపు ఉ.10 గం. నుంచి సా.5 గం. వరకు ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు. అటు రేవంత్ రేపు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై వినతిపత్రాలు ఇస్తారని తెలుస్తోంది. యూరియా కొరత, ఇటీవల భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని వారికి వివరించనున్నారు.