News September 7, 2025
భద్రాచలం MLA పిటిషన్.. రాష్ట్ర వ్యాప్తంగా వివాదం

ST జాబితా నుంచి లంబాడీలను తొలగించాలంటూ ఆదివాసీలు, తాము అదే జాబితాలో ఉండాలని లంబాడీల మధ్య వివాదం తీవ్రమైంది. భద్రాచలం MLA తెల్లం వెంకటరావు, మాజీ MP సోయం బాపురావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని ఆదివాసీలు ఆరోపిస్తుండగా, తాము ఆర్థికంగా వెనుకబడే ఉన్నామని లంబాడీలు అంటున్నారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు త్వరలో తుదితీర్పు ఇవ్వనుంది.
Similar News
News September 9, 2025
భూపాలపల్లి జిల్లాలో సోమవారం ముచ్చట్లు

✓ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ కిరణ్ ఖరే
✓ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పోలీసుల లాఠీఛార్జ్
✓ భూపాలపల్లిలో అదనంగా 16 ఎరువు విక్రయ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్
✓ అన్నారం బ్యారేజీలో పడి ఒకరి గల్లంతు
✓ యూరియా కోసం జిల్లా వ్యాప్తంగా రైతుల ఇబ్బందులు
✓ మహిళలు వేధింపులకు భయపడొద్దు: సివిల్ జడ్జి అఖిల
News September 9, 2025
ఏటూరునాగారం డిగ్రీ కాలేజీలో మహిళా సాధికారతపై అవగాహన

మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మిషన్ శక్తి 10 రోజుల అవగాహన కార్యక్రమంలో ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు గృహహింస చట్టం-2005, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం -2013, వరకట్న నిషేధ చట్టం-1961, అనైతిక రవాణా నివారణ-1956 చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులు మహేందర్, పి.రమాదేవి, శిరీష, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
News September 9, 2025
వరంగల్: బెట్టింగ్‌ల కోసమే కిడ్నాప్ డ్రామా..!

వరంగల్‌లో జరిగిన <<17653755>>కిడ్నాప్ డ్రామా<<>> సుఖాంతమైంది. పోచమ్మమైదాన్‌లోని జకోటియా కాంప్లెక్స్ వద్ద ఈరోజు సాయంత్రం జరిగిన కిడ్నాప్‌ను పోలీసులు చేధించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటున్న యువకుడే తాను కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడాడు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని కనిపెట్టి డ్రామాకు తెరదించారు. ఆన్‌లైన్ బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకొని అప్పులపాలైన యువకుడి ఆట కట్టించారు.