News September 7, 2025

అప్పుల బాధ తాళలేక ఇద్దరు సూసైడ్

image

అప్పుల బాధ తాళలేక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వెల్దుర్తి(M) పేరేములకు చెందిన మద్దిలేటి(50) కూతురి పెళ్లితో పాటు వ్యవసాయానికి అప్పులు చేశారు. వాటిని తీర్చేమార్గం లేక పురుగు మందు తాగి కోలుకున్నాడు. ఈ ఏడాదీ అప్పులు పెరగడంతో ఉరేసుకున్నాడు. మంత్రాలయం(M) మాలపల్లికి చెందిన ఉపేంద్ర(21)కు ఇటీవలే పెళ్లైంది. అప్పులు ఎక్కువ కావడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Similar News

News September 9, 2025

పంజాబ్‌ వరదలు.. భజ్జీ మంచి మనసు

image

భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన పంజాబ్‌కు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ తన వంతు సాయం చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు 11 స్టీమర్ బోట్లు, 3 అంబులెన్సులు, రూ.50 లక్షలను సేకరించి విరాళంగా అందించారు. కాగా భారీ వర్షాలకు పలు ఘటనల్లో పంజాబ్‌లో 48 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదలతో పంట నష్టపోయిన చోట ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.20 వేల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది.

News September 9, 2025

జాఫర్‌గఢ్: పెట్టుబడి దారి సమాజానికి ప్రత్యామ్నాయం సోషలిజమే: రాపర్తి రాజు

image

పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు అన్నారు. జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లిలో సీపీఎం మండల రాజకీయ శిక్షణా తరగతులను ఈరోజు ప్రారంభించారు. రాపర్తి రాజు పాల్గొని సీపీఎం జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారీ సమాజానికి కాలం చెల్లిందని, భవిష్యత్ సోషలిజం, ఎర్రజెండానే అని అన్నారు.

News September 9, 2025

భూపాలపల్లి జిల్లాలో సోమవారం ముచ్చట్లు

image

✓ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ కిరణ్ ఖరే 
✓ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పోలీసుల లాఠీఛార్జ్
✓ భూపాలపల్లిలో అదనంగా 16 ఎరువు విక్రయ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్
✓ అన్నారం బ్యారేజీలో పడి ఒకరి గల్లంతు
✓ యూరియా కోసం జిల్లా వ్యాప్తంగా రైతుల ఇబ్బందులు
✓ మహిళలు వేధింపులకు భయపడొద్దు: సివిల్ జడ్జి అఖిల