News September 7, 2025

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

గణేష్ నిమజ్జనానికి పక్కడ్బందీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బీబీనగర్లోని పెద్ద చెరువు వద్ద ఏర్పాటుచేసిన గణేష్ నిమజ్జన ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అందరిని సమన్వయం చేస్తూ నిమజ్జన కార్యక్రమాలను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 9, 2025

గ్రీవెన్స్ డే.. బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ డే జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగుతుంది. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది అర్జీదారులతో ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని వారిని ఆదేశించారు. ఈ ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.

News September 9, 2025

TODAY HEADLINES

image

* ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు: సీఎం రేవంత్
* హిందీ తప్పనిసరని ఎక్కడా చెప్పలేదు: లోకేశ్
* రాష్ట్రానికి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న
* ఎరువుల సరఫరాలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష: పొన్నం
* బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి: భట్టి
* ఉపరాష్ట్రపతి ఎన్నికకు మా ఎంపీలు దూరం: KTR
* అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి రాజారెడ్డి: షర్మిల
* టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్

News September 9, 2025

JGTL: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జక్క ఆనంద్(25) అనే యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బుగ్గారం మండలం శెకల్ల గ్రామానికి చెందిన ఆనంద్ ఆదివారం రాత్రి మండంలోని బతికపల్లి గ్రామానికి వస్తుండగా, లింగాపూర్ ఎల్లమ్మ గుడి మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడన్నారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు.