News September 7, 2025
మహిళలూ.. జింక్ తగ్గిందా..?

మహిళల ఆరోగ్యానికి జింక్ ఎంతో అవసరం. జింక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఉత్పత్తిని పెంచుతుంది. గర్భాశయానికి రక్తప్రసరణ పెంచి, నెలసరిలో వచ్చే నొప్పుల్ని తగ్గిస్తుంది. గాయాలు, వాపులు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. చర్మ కణాల పునరుద్ధరణకు సాయపడుతుంది. పునరుత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుంది. జింక్ కోసం చిక్కుళ్లు, శనగలు, గుమ్మడి, పుచ్చగింజలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి.
Similar News
News September 9, 2025
‘స్వదేశీ మేళా’లు నిర్వహించండి.. NDA ఎంపీలకు ప్రధాని పిలుపు

మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు NDA ఎంపీలు ‘స్వదేశీ మేళా’లను నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. GST రేట్ల తగ్గింపుపై వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని, GST సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు MPలు తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో NDA MPలతో ఆయన సమావేశమయ్యారు. ఓటు వృథా కాకుండా సరైన పద్ధతిలో వేయాలన్నారు.
News September 9, 2025
పంజాబ్ వరదలు.. భజ్జీ మంచి మనసు

భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన పంజాబ్‌కు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ తన వంతు సాయం చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు 11 స్టీమర్ బోట్లు, 3 అంబులెన్సులు, రూ.50 లక్షలను సేకరించి విరాళంగా అందించారు. కాగా భారీ వర్షాలకు పలు ఘటనల్లో పంజాబ్‌లో 48 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదలతో పంట నష్టపోయిన చోట ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.20 వేల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది.
News September 9, 2025
ఆ కంపెనీలపై ట్రంప్ పన్ను పోటు!

అమెరికాలో విదేశీ వర్కర్లను నియమించుకునే కంపెనీలపై 25 శాతం అదనంగా పన్నులు విధించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పన్నులు ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు సమాచారం.